హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై

NLG: మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై అత్తి సతీష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విధులకు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో లీల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన స్వగ్రామం నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం.