హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ కెమెరాలతో నిఘా.. ఎస్పీ యాక్షన్ ప్లాన్!

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే అవకాశం ఉన్న (క్రైమ్ ప్రోన్) ప్రాంతాలపై పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. సాంకేతికతను వాడుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు ఈ ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.