కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరులో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులకు న్యాయం చేయాలని భిక్షాటనకు బయలుదేరగా, రాష్ట్రపతి పర్యటన వేళ అనుమతి లేదంటూ ఇంటి వద్దే నిలిపివేశారు. నోటీసులు ఇవ్వకుండా ఆపడం అన్యాయమని, నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సుంకర పద్మశ్రీని అడ్డుకున్న పోలీసులు


