అనకాపల్లి జిల్లా ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సహా కీలక శాఖలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కార్యాలయాలు పట్టణానికి దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన శాఖలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో పనుల కోసం వచ్చే వారికి రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాధనం ఖర్చు చేయకుండా ఒకేచోట సమీకృత భవన సముదాయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అద్దె భవనాల్లోనే అనకాపల్లి పాలన


