TG: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రూ.61 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లకు మహిళలను యజమానులుగా చేశామన్నారు. యువత, మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి భరోసా కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
వార్తలు
మహిళలు, యువతకు అండగా ఉంటాం: రేవంత్


