హైదరాబాద్: 28°C
వార్తలు

2029 ఏప్రిల్ నుంచి BS-VII ఎమిషన్ నార్మ్స్!

వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. 2029 ఏప్రిల్ నుంచి BS-VII నిబంధనలు తీసుకురానుందట. ముందుగా కొత్త కార్లు, SUVలకు ఇవి వర్తిస్తాయి. ఆ తర్వాతే బస్సులు, ట్రక్కులకు అమలు చేస్తారు. ఇంజిన్ కాలుష్యంతో పాటు బ్రేకులు, టైర్ల నుంచి వచ్చే దుమ్మును సైతం ఇందులో లెక్కిస్తారు. అయితే, ప్రస్తుతం వాడుతున్న పాత వాహనాలకు ఈ నిబంధనలతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.