హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాలు కురవాలని వరుణ యాగం

ప్రకాశం: ప్రజల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధిని కాంక్షిస్తూ సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బుధవారం వరుణ యాగం, వరుణ జపం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఈవో రంగరాజుల పర్యవేక్షణలో పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, చెరువులు, ప్రాజెక్టులు, నీటితో నిండాలని కోరుకున్నారు.