హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సంరక్షణ పనులను పరిశీలించిన కలెక్టర్

KRNL: గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో జలధార–జలహారతి 2.0 కార్యక్రమం కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఇవాళ పరిశీలించారు. గ్రామంలో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టి, జలవనరులను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.