హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మహాచండీ దేవి రూపంలో అమ్మవారు

NTR: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నాల్గవ రోజు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ దేవిని ప్రార్థిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి అనుగ్రహం వలన విద్యాబుద్ధులు, కీర్తి, ఐశ్వర్యం లభిస్తుంది.