ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు వెలిగండ్ల మాజీ జడ్పీటీసీ గుంటక తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ విజయం కోసం కృషి చేయాలి'


