హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు రైల్వే కాలనీలో భక్తి శ్రద్దలతో చండీ హోమం

ASR: అరకు రైల్వే స్టేషన్ రైల్వే కాలనీలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో నాల్గవ రోజు చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాల్గవ రోజు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదమంత్రాల నడుమ జరిగిన హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.