హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన సదస్సు

GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, ఈస్ట్ డీఎస్పీ టీ. సీతారామ్ ఆధ్వర్యంలో గుంటూరు సంగడిగుంట ప్రాంతంలోని వడ్డెరగూడెంలో పోలీసులు ‘సంకల్పం – డ్రగ్స్ అవగాహన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, విద్య, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.