చిత్తూరు జిల్లాకు పల్లెబాట 3.0 కింద 2026-27లో రూ.43.86 కోట్లు మంజూరయ్యాయని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో 428 పనులకు ఆమోదం లభించింది. పూతలపట్టులో 108, జీడీ నెల్లూరులో 101, చిత్తూరులో 68, నగరిలో 66, పుంగనూరులో 47, పలమనేరులో 38 పనులు చేపడతారు. సీసీ, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, కల్వర్టులు నిర్మిస్తారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరుకు రూ.43.86 కోట్ల పనులు


