ATP: జాతీయ రగ్బీ పోటీలకు బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని నందిని ఎంపికైంది. ఇటీవల కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఈనెల 30న ఢిల్లీలో జరిగే స్కూల్ గేమ్స్ అండర్-19 పోటీలకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ, పీడీ గట్టు నాగరాజు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రగ్బీ పోటీలకు అనంత విద్యార్థిని


