E.G: రాజమండ్రి నగరంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నల్లా ఛానల్ వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న అదనపు వెంట్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లనుంది. గోదావరి జలాల పరిరక్షణకు మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి మళ్లించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నల్లా ఛానల్ వద్ద రూ.2 కోట్లతో అదనపు వెంట్


