హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జెడ్పీ సీఈవో ఊర్మిళా దేవి సస్పెన్షన్

నంద్యాల జిల్లా పరిషత్ సీఈవోగా ఊర్మిళా దేవిని నియమిస్తూ.. ఈ నెల 10న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటివరకు బాధ్యతలు స్వీకరించకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఊర్మిళా దేవిని సస్పెండ్ చేస్తూ.. సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.