హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షిలో పోలింగ్ కేంద్రాల తనిఖీ

SS: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో లేపాక్షి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రహరీ, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.