హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూ.2 కోట్లతో మండపం నిర్మాణానికి, నుడా నిధులు రూ.10 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.