BPT: చుండూరు(M) కేఎన్ పల్లిలో బుధవారం కార్డాన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. సరైన పత్రాలు లేని 20 బైక్లు, ఒక ఆటో, కారును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బందితో ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ చర్యల్లో భాగంగా ఈ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్లో 22 వాహనాలు సీజ్


