KDP: ఖాజీపేట (M) పత్తూరు నుంచి సర్వర్ణాన్ పేట, డాంఖాన్ పల్లె గ్రామాలకు వెళ్లే దారిలో చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త డబ్బాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైనే వ్యర్థాలు వేస్తున్నారని, దుర్వాసనతో అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై చెత్త.. దుర్వాసనతో అవస్థలు!


