PLD: వినుకొండను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం రూ.16.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.15 కోట్లతో 36 వార్డుల్లో సీసీ రోడ్లు, రూ.1.50 కోట్లతో మార్కాపురం, నరసరావుపేట, కారంపూడి రోడ్లలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడతారు. పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని జీవీ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండ సుందరీకరణే ధ్యేయం: ఎమ్మెల్యే జీవి


