AKP: మునగపాక మండలం మూలపేటలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా చండీ హోమం నిర్వహించారు. చాముండేశ్వరి, మహాలక్ష్మి దేవి అలంకారాల్లో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆడారి జనార్ధనరావు, ఆనంద సన్యాసినాయుడు, రామకోటి కుటుంబాల సహకారంతో కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూలపేటలో వైభవంగా చండీయాగం


