PPM: కొమరాడలో ఏఓబీ అంతర్రాష్ట్ర రహదారి దుస్థితిపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం దెబ్బతిన్న రహదారిని, ప్రమాదానికి గురైన లారీని నాయకుడు కొల్లి సాంబమూర్తి పరిశీలించారు.ఈ మలుపు వద్ద ఆరేళ్లలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని,ఒక్కరోజే ఆటో ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారని తెలిపారు. ప్రమాదాల నివారణకు తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మృత్యు మలుపుగా ఏఓబీ రహదారి


