హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరుగుతున్న వీధి కుక్కల సంచారం

E.G: సీతానగరం మండలంలో వీధి కుక్కల సంచారం పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధులు, ప్రధాన రహదారులపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.