హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జడ్పీ నూతన సీఈఓగా పి. వసంత బాధ్యతల స్వీకరణ

కోనసీమ: జిల్లా పరిషత్ నూతన సీఈఓగా పి. వసంత మాధవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ రావిరాలను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల సమర్థవంతమైన నిర్వహణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.