KDP: బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, ఛైర్మన్ స్థానం అన్రిజర్వుడ్గా కేటాయించినట్లు కమిషనర్ కృష్ణ తెలిపారు. మొత్తం 56,873 మంది ఓటర్లలో 28,991 మంది మహిళలు, 27,881 మంది పురుషులు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు 80 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్లో 80 పోలింగ్ కేంద్రాలు: కమిషనర్


