హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

PLD: పిడుగురాళ్ల 32వ వార్డు ముస్లిం మైనార్టీ నాయకుడు ఆడితీల షేక్ సైదు మీరా బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం ఎమ్మెల్యే పంపిన రూ. 50,000 ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకులు సైదు మీరా సతీమణి జైనాబీకి అందజేశారు.