హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

194 కోట్లతో తాగు నీటి ప్రాజెక్టుకు శ్రీకారం

E.G: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.194 కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలధార ప్రాజెక్టుకు రాజానగరం బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ కింద చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాజానగరం, కడియం, రాజమండ్రి పరిధిలోని గ్రామాలకు గోదావరి జలాలను సరఫరా చేయనున్నారు.