హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయాల్లో ఖాళీల భర్తీకి ఎదురుచూపులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 60 గ్రంథాలయాల్లో సుమారు 50 శాతం గ్రంథాలయ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పలు గ్రంథాలయాలు ఇన్‌చార్జిలతోనే నడుస్తున్నాయి. ఇన్‌చార్జిలు వారానికి మూడు రోజులు మాత్రమే వస్తుండటంతో, వారు వచ్చినప్పుడే పుస్తకాల విభాగాన్ని తెరుస్తున్నారు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.