హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై పోలీసుల నిఘా

W.G: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నరసాపురం టౌన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఎన్నికల్లో వివాదాలు, గొడవలకు పాల్పడిన ఐదుగురిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు CI ఆకుల రఘు తెలిపారు. ఎన్నికల సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.