హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి కోసం గ్రామస్థుల చందాలు

PPM: కొమరాడ మండలం చోళపద్రం పంచాయతీ పరిధిలోని వనధార గ్రామానికి రహదారి లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం రోగులను డోలీల్లో మోసుకెళ్లాల్సి వస్తోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులే ఒక్కో ఇంటి నుంచి రూ.3 వేల చొప్పున చందాలు సేకరించి రహదారి నిర్మాణానికి పూనుకున్నారు.