హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి త్రీ టౌన్‌ సీఐగా శ్రీనివాసరావు

GNTR: తెనాలి త్రీ టౌన్ నూతన సీఐగా కాటూరి శ్రీనివాసరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన సాంబశివరావు కొద్దిరోజులుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు తీసుకున్న సీఐ శ్రీనివాసరావును పలువురు పోలీస్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.