హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలా త్రిపుర సుందరీ దేవిగా వాసవి అమ్మవారు

కోనసీమ: దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్‌లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నాలుగవ రోజు బుధవారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.