హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాతమల్లాయపాలెంలో కార్డాన్ అండ్ సెర్చ్!

GNTR: ప్రత్తిపాడు(M) పాతమల్లాయపాలెం గ్రామంలో పోలీసులు బుధవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.