విజయనగరం మండలం సారిక గ్రామంలోని శ్రీఇష్టకామేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్య నారాయణ శర్మ ఆధ్వర్యంలో గోపూజ, చండీ హోమం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా శ్రీ ఇష్టకామేశ్వరి ఉత్సవాలు


