హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధిక స్థానాల కోసం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థులు ప్రకటన ఎప్పుడు వలబడుతుందో తెలియాలి.