హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ నిమజ్జన ఘాట్లలో శుభ్రత పనులు

JGL: పెగడపల్లి మండలంలోని గ్రామాల్లో ఈ నెల 19న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిమజ్జనాల కోసం పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టారు. చెరువులు, కుంటల వద్ద ఘాట్లలో చెత్తాచెదారాన్ని జేసీబీలు, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. రాత్రివేళ భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.