హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ దేవికి 24 రకాల ప్రసాదాల సమర్పణ

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అన్నపూర్ణాదేవి అవతార పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు 24 రకాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.