హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉప్పల్‌లో నేడు టీ20 సమరం

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో నేడు భారత్‌, వెస్టిండీస్‌ మధ్య నాలుగో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉండగా, స్కోరు సమం చేయాలని కరీబియన్‌ జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.