హైదరాబాద్: 28°C
క్రీడలు

అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!

జింబాబ్వే మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా డంబానేవానా(36) అనారోగ్యంతో కన్నుమూసింది. చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. అండర్-19 మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు అంపైరింగ్ చేసిన తొలి జింబాబ్వే మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 63 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సేవలందించిన ఆమె మృతిపట్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు సంతాపం తెలిపింది.