AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7.10 గంటలకు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సుమారు 30 నిమిషాల పాటు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కడివారక్కడే ఉండాలని అధికారులు సూచించారు. ఆమె పర్యటన ముగిసిన వెంటనే దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వార్తలు
కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ముర్ము


