హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పిలుపు

MLG: మల్లంపల్లి మండలం దేవనగర్‌లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ములుగు ఎస్సై బి. చంద్రశేఖర్ మంగళవారం సూచించారు. దొంగతనాల నివారణకు కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. పంట పొలాల్లో అక్రమ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సలుగు సంతోష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.