హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మీ అలంకారంలో భద్రకాళి అమ్మవారు

WGL: భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు బుధవారం మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.