హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDకు అదనంగా 20 MGD తాగునీరు

HYD: నగర ప్రజలకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కీలక ముందడుగు పడనుంది. మల్లన్నసాగర్ నుంచి నవంబర్ నెల నుంచి హైదరాబాద్‌కు అదనంగా రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల (MGD) తాగునీరు సరఫరా చేయనున్నారు. దీంతో నగరంలో తాగునీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు నీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నారు.