BHPL: కాటారం మండలంలోని గుండ్రాత్పల్లి ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యతో మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదని, బోరు మోటారు నాలుగు రోజులుగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సర్పంచి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాని కోరారు.
తెలంగాణ
తాగునీటి కష్టాలు షురూ.. ఖాళీ బిందెలతో నిరసన


