హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ బాలిక అదృశ్యం..కేసు నమోదు

SRPT: ఆలేరు మండల పరిధిలో మైనర్ బాలిక అదృశ్యమైనట్లు SI కిరణ్ తెలిపారు. బచ్చన్నపేట మండలానికి చెందిన బాలిక ఈ నెల 4న ఆలేరు మండలంలోని సోదరి ఇంటికి వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని తల్లిదండ్రుల వద్దకు బయలుదేరి వెళ్లి, రాత్రి వరకు ఇంటికి చేరలేదు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు మంగళవారం రాత్రి తెలిపారు.