హైదరాబాద్: 28°C
తెలంగాణ

టపాసులు స్వాధీనం..కేసు నమోదు..!

KMR: మాచారెడ్డి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ. 3 లక్షల విలువైన టపాసులను మాచారెడ్డి పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చుక్కాపూర్కు చెందిన పాత నరేశ్ మరో ఏడుగురితో కలిసి దీపావళి కోసం కొనుగోలు చేసిన టపాసులను గజ్యానాయక్ తండాలోని ఓ షట్టర్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వదారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.