NLG: మర్రిగూడ మండలం అజ్జలాపురంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. నీటిని వృథా చేస్తూ.. రోడ్లపై వదిలితే రూ. 2 వేల జరిమానా విధించనున్నట్లు దండోరా వేయించారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి దృష్ట్యా గ్రామస్థులు నీటిని పొదుపుగా వినియోగించాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
VIDEO: తాగునీరు వృథా చేస్తే జరిమానా..!


