హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి'

 WNP: ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జొన్నలు, కొర్రలు, రాగులు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని రేవల్లి మండల వ్యవసాయ అధికారి మనిచందర్‌ సూచించారు. తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి సారించాలన్నారు. నీటి వృథాను అరికట్టి, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. సంప్రదాయ పంటల సాగుతో నీటి సంరక్షణ సాధ్యమని పేర్కొన్నారు.