SDPT: మర్కూక్ పరిధిలోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నాగరాజు, మల్లేశంలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గజ్వేల్, పాములపర్తి గుళ్లల్లో దొంగతనాలు చేసినట్లు తేలింది. నిందితుల నుంచి ఉత్సవ విగ్రహం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. వేగంగా కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని సీపీ రష్మి పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
దేవాలయ దొంగల ముఠా గుట్టురట్టు: నగలు, బైక్ స్వాధీనం


